హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో రద్దీ.. దర్శనానికి 18 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. క్యూలైన్ల రద్దీ శిలాతోరణం వరకు చేరింది. కాగా, నిన్న స్వామివారిని 76,060 మంది భక్తులు దర్శించుకోగా, 32,248 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.