హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫుడ్ పాయిజన్ ఘటన.. వార్డెన్‌పై వేటు

NRPT: ధన్వాడ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రియాంక స్పందించి తక్షణ విచారణకు ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన కలెక్టర్, నిర్లక్ష్యం వహించిన వార్డెన్‌ను తొలగించాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.