హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మహత్య కేసులో ఇద్దరి నిందితులు అరెస్ట్

KMM: ముదిగొండలో ఈ నెల 11న మట్టెల వినయ్ ఆత్మహత్య చేసుకున్న కేసులో నూకల నాగేశ్వరావు, షేక్ అజీజ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వేధింపుల కారణంగా ఘటన జరిగినట్లు కేసు నమోదు చేశారు. తమిళనాడులోని పాండిచేరీకి పరారైన నిందితులను రెండు ప్రత్యేక బృందాలు శుక్రవారం అదుపులోకి తీసుకున్నాయి. శనివారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.