హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువ పూడికతీత పనుల పరిశీలన

NLG: హాలియా సాగర్ రోడ్డులోని పేరూరు ఎల్-1 మైనర్ కెనాల్‌లో జరుగుతున్న పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్‌రెడ్డి పరిశీలించారు. కాలువల్లో చెత్త, వ్యర్థాలు వేయకుండా ప్రజలు, దుకాణదారులు సహకరించాలని కోరారు. వ్యర్థాలను పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.