PDPL: గంజాయి, మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. బార్ అధ్యక్షుడు రవీందర్, ప్రిన్సిపల్ మాధవీలత పాల్గొన్నారు.
తెలంగాణ
'మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి'


