హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సఖి వన్ స్టాప్ సెంటర్‌ని సందర్శించిన కలెక్టర్

అనకాపల్లిలో సఖి వన్ స్టాప్ సెంటర్‌ని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రూ.29 లక్షలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌లోగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.