హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గణేష్ నిమజ్జన ఘాట్లలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు'

కాకినాడలో గణేష్ నిమజ్జన ఘాట్లను అదనపు ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్‌ కుమార్ శనివారం పరిశీలించారు. జగన్నాధపురం బ్రిడ్జి, ఉప్పుటేరు, వార్ఫ్ రోడ్‌లోని నిమజ్జన ఘాట్ల వద్ద బారికేడింగ్, లైటింగ్, భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విగ్రహాల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.