హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరిలో నిమజ్జనానికి ట్రాఫిక్ ఆంక్షలు

సత్యసాయి: కదిరిలో ఈ నెల 20న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నట్లు టౌన్ పోలీసులు తెలిపారు. సుమారు 150 విగ్రహాలు నిమజ్జనం కానున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు పట్టణంలోకి ప్రవేశం ఉండదు. అత్యవసర వాహనాలు మినహా ఇతర వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని పోలీసులు సూచించారు.