హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలి'

ASR: బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే, అత్యవసర సమయాల్లో 112, 1070, 1800 425 0101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరారు.