హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

అన్నమయ్య: ప్రతి ఒక్కరూ తమ నివాస పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో వరప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా శనివారం రాజంపేట మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా గ్రామ ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.