TPT: తిరుపతిలోని ఎన్జీవో కాలనీలో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ జయకృష్ణ కాలువను శుభ్రం చేసి మొక్కలు నాటారు. పరిశుభ్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని, తిరుపతిని పరిశుభ్ర, సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర సాధ్యం'


