హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందుండగా భజనలు, మంగళవాయిద్యాల నడుమ పల్లకీసేవ వైభవంగా సాగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ.. స్వామివారిని దర్శించుకున్నారు.