హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి: కలెక్టర్

సత్యసాయి: ​'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర'లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మడకశిర నగర పంచాయతీ పరిధిలో పర్యటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద గ్రీన్ స్పేస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు.