BPT: చినగంజాం(M) సోపిరాల నుంచి వినాయక విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. ఆయా మండపాల వద్ద గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదు రోజుల అనంతరం కోలాటం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం నుంచి వినాయక ఊరేగింపుతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం పల్లెపాలెం రేవు వద్ద గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా వినాయక నిమజ్జనం


