హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్య శిక్షణ

ASR: పాడేరు గురుకుల మహిళా కళాశాలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో రెండో బ్యాచ్‌గా 120మంది విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్య శిక్షణను శనివారం ప్రిన్సిపాల్ ధనలక్ష్మి ప్రారంభించారు. విద్యార్థినుల్లో భద్రత, ఆత్మవిశ్వాసం, ధైర్యం, శారీరక దృఢత్వం పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగుతోందన్నారు. ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ ఆదేశాలతో, కరాటే ఇన్‌స్ట్రక్టర్ పాండురాజు శిక్షణ ఇస్తున్నారు.