హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆసుపత్రులను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలి'

PPM: ఆసుపత్రుల్లో రోగులకు వైద్యంతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని జిల్లా ఎన్‌సీడీ, స్వచ్ఛ ఆంధ్ర నోడల్ అధికారి డాక్టర్ టి. జగన్ మోహన్‌రావు సూచించారు. బందలుప్పి పీహెచ్‌సీలో శనివారం నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, వార్డులు, మరుగుదొడ్లను పరిశీలించారు.