హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆశా కార్మికులపై యాప్‌ల పనిభారం తగ్గించాలి'

KRNL: పుచ్చకాయలమాడ పీహెచ్‌సీ వద్ద ఆశా కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. లెప్రసీ సర్వే యాప్‌ను రద్దు చేసి అదనపు పనిభారం తగ్గించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ పీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకుడు ఎం. రవిచంద్ర హెచ్చరించారు.