హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెట్లపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు

విశాఖ మధురవాడలోని శ్రీగాయత్రి విద్యానిలయంలో విషాదకర ఘటన జరిగింది. స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మెట్లపై నుంచి కింద పడిపోవడంతో సదరు బాలికకు గాయాలయ్యాయని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల సిబ్బంది బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.