హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమరాజు దారుణ హత్య

BDK: కరకగూడెం మండలం అశ్వాపురంపాడులో శనివారం వజ్జా భీమరాజు అనే వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం. గతంలో ఫారెస్ట్‌ అధికారులపై దాడి కేసులో, అదే గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు కోవాసి వెంకటేశ్వర్లు హత్య కేసులో భీమరాజు నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.