హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువత ఉన్నతంగా ఎదగాలి: ఎంపీ శబరి

NDL: డోన్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం 'యువత భవితకు భరోసా' కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాల్గొని విద్యార్థులు, యువతతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి సమస్యలు, ఆశయాలు తెలుసుకుని ఉన్నత విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. యువత లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు.