హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూరి జగన్నాథుడి సన్నిధిలో ఎమ్మెల్యే

SRD: జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శనివారం ఒడిశాలోని పూరి శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని, పటాన్‌చెరు మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు MLA తెలిపారు.