హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ: ఎంపీ శబరి

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం ఎంపీ కార్యాలయంలో 24 మంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.15,24,932 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యం, ఇతర వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, ఎంపీ బైరెడ్డి శబరికి కృతజ్ఞతలు తెలిపారు.