హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముడుపు కట్టిన న్యాయమూర్తి

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి ఈవీ వేణుగోపాల్, నామవరపు రాజేశ్వర్‌రావు శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆలయంలో ముడుపు కట్టారు. ఆలయ ఛైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, సర్పంచ్ బాదావత్ లక్ష్మిరాజునాయక్, ఈవో సత్యనారాయణ తదితరులు వారికి స్వాగతం పలికారు.