JN: రఘునాథపల్లి మండలం కంచనపల్లి పంచాయతీ పరిధిలోని కమలాపురం–దొనబండ గ్రామాలకు 40 ఏళ్లుగా రహదారి సమస్య వెంటాడుతోంది. 2 కి.మీ మేర మట్టి రోడ్డే దిక్కుగా ఉండగా, పదేళ్ల క్రితం వేసిన కంకర, మొరం రోడ్డు కూడా దెబ్బతిని మట్టిరోడ్డుగా మారింది. వర్షం కురిస్తే బురదమయంగా మారడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
బురదమయంగా రహదారి


