హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభ్యర్థులను సిద్ధం చేయాలి'

ASR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి శ్రేణులు విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం సూచించారు. అనంతగిరిలో శనివారం నిర్వహించిన పార్టీ సన్నద్ధత, బూత్ కమిటీల బలోపేతం, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికే టికెట్లు ఇస్తామన్నారు. అభ్యర్థులను సిద్ధం చేయాలని నాయకులకు సూచించారు.