హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తుల రద్దీతో కిక్కిరిసిన ఘాట్ రోడ్డు..!

TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 5వ రోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ తీవ్రం కావడంతో ఘాట్ రోడ్డు వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఇవాళ జరిగే గరుడ వాహన సేవ నేపథ్యంలో, అలిపిరి నుంచి ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల రాకపోకలను నిలిపివేశారని, పార్కింగ్ సర్దుబాటు చేసిన తర్వాతే వాటిని కొండపైకి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.