W.G: చిన్నారులకు సమతుల పోషకాలతో కూడిన ఆహారం అందించాలని ICDS CDPO టీఎల్ సరస్వతి సూచించారు. జాతీయ పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా శనివారం తాడేపల్లిగూడెం 23వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నతనం నుంచి ఇచ్చే పోషణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అనంతరం ఆహారం పంపిణీ చేశారు. సూపర్వైజర్లు విశాలాక్షి, దుర్గాభవాని, కాశి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారులకు పోషకాహారం అందించాలి: CDPO


