హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ కళాశాలలో ఘనంగా వేడుకలు

MDK: రామాయంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు హాజరై విద్యార్థులను అభినందించారు. సోదరభావంతో మెలుగుతూ అలాగే విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.