KRNL: ఆలూరు నియోజకవర్గంలో ఈ నెల 24న నిర్వహించనున్న జాబ్‌మేళా పోస్టర్‌ను కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ.సిరి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాబ్‌మేళా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న యువత పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్!


