SRCL: వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి జడ్పీహెచ్ఎస్‌లో శనివారం సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. 10 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంఈవో లోకల్ కిషన్ మాట్లాడుతూ.. కష్టపడితే ప్రతి ఒక్కరూ విజయం సాధించవచ్చని, ప్రతిభ ఎవరి సొత్తు కాదని అన్నారు. హెచ్ఎం సదానందం, ఐఈఆర్పీ రఘు, పీడీలు జ్యోతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రతిభ ఎవరి సొత్తు కాదు: ఎంఈఓ


