హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

W.G: నరసాపురం తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ఉప ఖజానా కార్యాలయాలను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు అందుతున్న సేవలు, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ, పెండింగ్ అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.