హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిబంధనల మేరకే నూతన పింఛన్ల మంజూరు'

VZM: జిల్లాలో నూతనంగా దరఖాస్తు చేసుకున్న పింఛన్లను ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత అర్హతల మేరకే పరిశీలించి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వెబెక్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 21లోగా భౌతిక పరిశీలన, 24లోగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.