కృష్ణా: జిల్లా మచిలీపట్నంలో భవానీ మాలలు ధరించి అమాయక మహిళలను మోసం చేస్తూ బంగారు నగలు తస్కరిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 గ్రాముల బంగారు చైన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే దొంగ స్వాముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇనుగుదురు సీఐ పరమేశ్వరరావు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
భవాని మాల.. నలుగురు అరెస్ట్..!


