హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాయపడిన బాలుడిని పరామర్శించిన భూపేశ్

KDP: కొండాపురం వినాయక చవితి వేడుకల్లో టపాసు చేతిలో పేలడంతో తీవ్రంగా గాయపడిన మెరిన్ కుమార్ (12) కడపలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శనివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి బాలుడిని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. ఆపరేషన్కు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని బాలుడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.