హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం'

అన్నమయ్య: కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ప్రజా సంక్షేమం, రైతుల సమస్యలపై తగిన శ్రద్ధ చూపడం లేదని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి విమర్శించారు. రాయచోటిలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతుందని ముందే అంచనాలు ఉన్నప్పటికీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.