హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేలులో స్వచ్ఛతా కార్యక్రమం

KDP: బద్వేలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పెద్ద చెరువు వద్ద వినాయక నిమజ్జన ప్రాంతంలో నిర్వహించారు. కమిషనర్ కృష్ణ ఆధ్వర్యంలో చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచగలమని కమిషనర్ తెలిపారు.