కడప: జిల్లాలో కేంద్ర విద్యాశాఖ అధికారి రంజిత్ కుమార్ సైని పర్యటిస్తున్నారు. శనివారం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్థానిక పాఠశాలను పరిశీలించి పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం కడప నగరంలోని పలు పాఠశాలలను ఆయన తనిఖీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోదండరాముడిని దర్శించుకున్న విద్యాశాఖ అధికారి


