హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లూసంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్

ASR: కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ తమ సిబ్బందితో శనివారం లూసంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు వజ్రప్రహార్ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు.