హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత క్రీడాకారులకు అండగా ఎన్నారైలు

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లకు వసతి కష్టాలు ఎదురవుతున్నాయి. సరైన వసతి ఏర్పాట్లు లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆపన్నహస్తం అందించేందుకు ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) దాతృత్వం చాటుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మన అథ్లెట్లకు ఆశ్రయం కల్పించేందుకు అక్కడి సుమారు 2 వేల మంది ఎన్నారైలు సిద్ధమయ్యారు.