హైదరాబాద్: 28°C
క్రీడలు

అట్టహాసంగా ప్రారంభమైన ఆసియా క్రీడలు

జపాన్‌లోని నగోయాలో ఆసియా క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ గేమ్స్‌లో 45 దేశాల క్రీడాకారులు  పాల్గొననున్నారు. భారత్ నుంచి 30కిపైగా క్రీడల్లో 503 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, 2022లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో పతకాల పట్టికలో 28 బంగారు పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.