హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇది జాబ్ మేళా కాదు..వసూళ్ల మేళ'

SRPT: నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 4,000 భృతి, ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారని, ఇప్పుడు జాబ్ మేళాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీశారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. కోదాడలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, రైతులు, దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.