హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడివాడ అమర్‌నాథ్ ఎంపీకి సవాల్

VSP: ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము గెలిచినా, ఓడినా మా వెంట వేలాది మంది కార్యకర్తలు నడుస్తారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ సెంటరైనా చెప్పు, ఒకే ఒక్క రోజు సమయం ఇస్తే 10,000 మందిని నిలబెడతానని సవాల్ విసిరారు. నీ వెనుక ప్రభుత్వం ఇచ్చిన గన్‌మ్యాన్‌లు తప్ప ఎవరు వస్తారో చూద్దామన్నారు.