హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురుగుమందుల షాపులపై ఏఓ రైడ్స్

NTR: వత్సవాయి మండలంలోని పురుగుమందుల షాపులను మండల వ్యవసాయ అధికారి జీ. సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపుల్లోని రికార్డులను పరిశీలించి, నాణ్యత నిర్ధారణ కోసం పురుగుమందుల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన పురుగుమందులు అందేలా చూడటమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.