హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సులో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం

MDK: రామాయంపేట బస్టాండ్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రయాణికులు, మహిళలకు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల రక్షణ, ఈవ్‌టీజింగ్ నివారణ, సైబర్ భద్రత, డయల్ 112 సేవలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఆపదలో ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సిబ్బంది సూచించారు. పోలీసులు నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉంటారన్నారు.