హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిపక్షం మనస్తత్వం మార్చుకోవాలి: పొంగులేటి

HYD: ప్రధాన ప్రతిపక్షానికి చెందిన కొంతమంది వ్యక్తులు వివిధ రకాల పూజలు చేసి రాష్ట్రానికి వర్షాలు పడకుండా చేస్తున్నారనే విషయాన్ని తాను చూసి, విన్నానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా వారు తమ మనస్తత్వాన్ని మార్చుకుని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, మంచి కోసం కోరుకోవాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేశారు.