హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవంత్‌కు చెంపపెట్టు లాంటిది: కౌశిక్

HYD: దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ వద్ద మాట్లాడుతూ.. మిగతా ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందని పేర్కొన్నారు.