MHBD: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిథిలావస్థకు చేరిన తరగతి గదులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని SFI జిల్లా కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు. SFI కళాశాల యూనిట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ లక్ష్మణ్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. రేకులు పగిలిపోవడంతో వర్షం సమయంలో గదుల్లోకి నీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
"గదులకు మరమ్మతులు చేపట్టాలి"


