హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అన్నమయ్యను కరువు జిల్లాగా ప్రకటించాలి'

అన్నమయ్య: వర్షాభావంతో పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. గాలివీడు మండలంలో పంటలను పరిశీలించిన ఆయన, నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించాలని కోరారు.