హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రికెట్ అభివృద్ధిపై బీసీసీఐతో చర్చలు

NTR: ముంబైలో జరిగిన 95వ బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ మౌలిక వసతుల పెంపు, స్టేడియాల అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.