ASR: చింతపల్లి మండలానికి చెందిన గిరిజన కాఫీ రైతులకు మినుములూరు కాఫీ బోర్డు కేంద్రంలో సాంకేతిక శిక్షణ ఇచ్చారు. కాఫీ బోర్డు ఎస్‌ఎల్‌ఓ రమేష్, ఏఈవో దుర్గాభవాని నర్సరీ నిర్వహణ, నాణ్యమైన మొక్కల ఎంపిక, శాస్త్రీయ సాగు, పోషక యాజమాన్యం, తెగుళ్ల నియంత్రణపై అవగాహన కల్పించారు. నర్సరీని సందర్శించి పల్పింగ్ యంత్రాల వినియోగం, కాఫీ ప్రాసెసింగ్‌ను రైతులు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
కాఫీ రైతులకు సాంకేతిక శిక్షణ


